ఉద్యోగాల తొలగింపుపై అమెజాన్ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగుల కోతలు ఇక్కడితో ఆగిపోవని.. వచ్చే ఏడాదిలోనూ కొనసాగుతాయని సీఈవో ఆండీ జస్సీ తెలిపారు. కంపెనీ తీసుకున్న నిర్ణయాల్లో ఇప్పటివరకూ ఇదే అత్యంత కఠినమైందని పేర్కొన్నారు. ఎక్కడ ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉందో క్షుణ్ణంగా చేసిన అధ్యయనంలో భాగంగానే కొన్ని విభాగాల్లో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.