జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. శ్రీనగర్ లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వయసు పెరుగుతోందని, పార్టీని నడిపించే శక్తి తనకు లేదని చెప్పారు. ఇక పార్టీ నూతన అధ్యక్షుడిగా ఆయన కుమారుడు ఒమర్ అబ్దుల్లా బాధ్యతలను చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఒమర్ అబ్దుల్లా ఉన్నారు. డిసెంబర్ 5న కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది.