నవంబర్ 19న వారణాసిలో నెల రోజుల పాటు నిర్వహించనున్న ‘కాశీ తమిళ సంగమం’ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.సంస్కృతి, టెక్స్టైల్స్, రైల్వేలు, టూరిజం, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వంటి ఇతర మంత్రిత్వ శాఖల సహకారంతో విద్యా మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.