ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీ ఆపర్ తో 5జీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్న అమెజాన్

business |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 11:56 PM

దేశమంతటా 5జీ సేవల దిశగా అడుగులు పడుతున్న సమయంలో 5G స్మార్ట్‌ఫోన్‌ ను ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్‌ లో భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో పొందొచ్చు. షావోమి 11టీ ప్రో 5జీ ఫోన్‌పై భారీ తగ్గింపు ధర అందుబాటులో ఉంది.


ఈ ఫోన్‌లో 108 కెమెరా, 120 వాట్ చార్జింగ్ స్పీడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను ఇప్పుడు మీరు రూ. 36,999 ధరకే పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్‌పీ రూ. 52,999. అంటే మీకు ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్ లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్ కూడా ఉంది. ఇందులో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి రూ. 4 వేల వరకు తగ్గింపు వస్తుంది. ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే.. షావోమి 11టీ ప్రో ఫోన్‌ను రూ. 32,999 కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.


ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే, డాల్బే విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ఎక్స్60 5జీ మోడెమ్, 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ 17 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది. ఈఎంఐ ఆఫర్‌లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు.


నెలవారీ ఈఎంఐ రూ. 1768 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 3339 చెల్లించాల్సి ఉంటుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 6167 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కాగా ఈ ఈఎంఐ ఆఫర్లు అనేవి కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో కొనే ముందు చెక్ చేసుకోవాలి.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com