కరోెనాకు పుట్టినిల్లుగా మారిన చైనాకు మరో వింత ఘటన అలజడికి గురి చేస్తోంది. చైనాలో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. రోజుల తరబడి పెద్ద ఎత్తున గొర్రెలు ఆగకుండా వృత్తాకారంలో తిరుగుతూనే ఉన్నాయి. గొర్రెలు అలా తిరగడం ఓ మిస్టరీగా మారింది. ఈ ఘటనపై నిపుణులు సైతం షాక్ అవుతున్నారు. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఇది జరిగింది. పది రోజులకుపైగా పెద్ద సంఖ్యలో గొర్రెలు వృత్తాకారంలో తిరుగుతున్నాయి. కచ్చితమైన సర్కిల్లో ఏ మాత్రం గాడి తప్పకుండా తిరుగుతూనే ఉన్నాయి.
గొర్రెల్లో ఈ వింత ప్రవర్తనకు స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చైనా సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. అయితే గొర్రెలు ఇలా ఎందుకు తిరుగుతున్నాయో..? తెలియక చైనా నిపుణులు అయోమయంలో పడ్డారు. దీనికి ఎవరి దగ్గరా స్పష్టమైన సమాధానం లేదు. దాంతో దీనిపై రకరకాల ఊహాగానాలు, థియరీలు పుట్టుకొస్తున్నాయి.
గొర్రెల మంద ఇలా తిరగడం వెనుక దేనికో సూచన అని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే సునామీకి ముందు తాబేళ్లు వంటి కొన్ని జలచరాలు సముద్ర తీరానికి పరుగెత్తుతాయని దాని ద్వారా ముందుగానే విపత్తును గుర్తించవచ్చని కొందరి అభిప్రాయం. అలాగే ఈ గొర్రెలు ఇలా తిరగడం వెనుక.. ఇలాంటి ప్రకృతి విప్తతుకు సంబంధించిన సూచన దాగి ఉందని కొందరు భావిస్తున్నారు. ఈ గొర్రెల ప్రవర్తన దేశం నలుమూలల్లోని శాస్త్రవేత్తలకు పరీక్షగా మారాయి.
అలాగే లిస్టెరియోసిస్ అనే బ్యాక్టీరియా వ్యాధి జంతువుల్లో ఇలా సర్కిల్‌గా తిరగడానికి కారణమవుతుందని కొందరు పరిశోధకులు అంటున్నారు. దానిని దీనిని సర్క్లింగ్ డిసీజ్ అని కూడా పిలుస్తారంట. అయితే ఈ గొర్రెల వింత ప్రవర్తనకు సంబంధించిన వీడియోని చైనా ప్రభుత్వ అవుట్‌లెట్ పీపుల్స్ డైలీ బుధవారం ట్వీట్ చేసింది. అలాగే గొర్రెలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాయని నివేదించింది. దీంతో వాటి ప్రవర్తిన మిస్టరీగా మిగిలిపోయింది.