ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వీడి ట్రెండ్ బాగుండా...స్మశాన పేటికలో వచ్చిన పెళ్లి కొడుకు

international |  Suryaa Desk  | Published : Fri, Nov 18, 2022, 11:58 PM

ఈ రోజుల్లో పెళ్లి గుర్తుండేలా చేయాలని వింత వింత పోకడలకు వెళ్తున్నారు. అలాంటి ఓ వింత పోకడ వీడియో సోషల్ మీడియాలో్ వైరల్ అవుతోంది.  వెర్రి వెయ్యి రకాలు అంటుంటారు. కొందరు ఆలోచనలు, ప్రవర్తన చూస్తే ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తుంటుంది. ఈ మధ్యకాలంలో కొందరి ప్రీ వెడ్డింగ్ షూట్‌లు చూస్తే.. ఇది బాగా అర్థమవుతుంది. ఇలా ఓ పెళ్లికొడుకు.. మండపానికి విచ్చేసిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కొందరైతే ఇదేం పోయే కాలం అని కూడా అంటున్నారు. అంతగా ఏం చేశాడనుకుంటున్నారా..? తన పెళ్లికి.. వరుడు చక్కగా తయారై.. గుర్రంపైనో, కారులోనే రావాలి. కానీ అలా రాకుండా శవపేటికలో వచ్చి.. అందరికి షాక్ ఇచ్చాడు.


ఓ పెళ్లి కొడుకు సాధారణంగా రావడం ఇష్టం లేకో.. కొత్త ట్రెండ్ సృష్టించాలనుకున్నాడో కానీ.. చాలా భిన్నంగా ప్రయత్నించాడు. ఆరుగురు స్నేహితులు అతను ఉన్న శవపేటికను మండపానికి మోసుకెళ్లారు. దానిని ఒక దగ్గర పెట్టగా.. అందులోంచి బయటకొచ్చాడు. బంధువులు, స్నేహితులు అవాక్కయ్యారు. అంతేకాదు అందరూ ఆ శవపేటిక దగ్గర నిలబడి ఫోటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ... దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయింది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com