ఓ జవాన్ పూర్వీకులు ఇచ్చిన భూమిని దక్కించుకునేందుకు 28 ఏళ్లు పోరాటం చేశాడు. దక్షిణ కర్ణాటక జిల్లా బంట్వాల్ తాలూకా విట్టల్ పడనూర్ కు చెందిన దివానా గోపాలకృష్ణ సైన్యంలో పని చేసి రిటైరయ్యారు. తన పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిని వేరే వాళ్లు సొంతం చేసుకునేందుకు యత్నించగా.. ఆయన కోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ 28 ఏళ్ల పాటు కొనసాగిన అనంతరం హైకోర్టు జవాన్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది.