భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) పరిధిలోని ప్రాచీన, చారిత్రక ప్రాంతాలను ప్రవేశ రుసుము లేకుండా నేటి నుంచి సందర్శించవచ్చు. ప్రపంచ వారసత్వ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 19 నుంచి 25 వరకు దేశంలోని తాజ్మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ వంటి ప్రాంతాల సందర్శనకు ప్రవేశ రుసుము ఉండదు. దేశ, విదేశీ పర్యాటకులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఏఎస్ఐ కోరింది.