14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఏ ఒక్కరోజైనా ప్రజల గురించి ఆలోచించాడా..? ఎన్నికల సమయం సమీపిస్తుందని మళ్లీ ప్రజల్లోకి వచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నాడు అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. 2024 చివరి ఎన్నికలు అని మాట్లాడుతున్న చంద్రబాబు.. అప్పుడు కూడా పోటీ చేస్తాడో.. లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. కర్నూలులోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి గుమ్మనూరు జయరాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం మాట్లాడుతూ.. చంద్రబాబు వయసు, అనుభవం పెద్దగా ఉండొచ్చు కానీ, ఆ వయసు, అనుభవంతో ప్రజలకు మంచి చేశాడా..? అని ప్రశ్నించారు.