40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. ఆ అనుభవంతో పచ్చి అబద్ధాలను ప్రచారం చేసుకుంటున్నాడని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీ చరణ్ అన్నారు. విశాఖలో జరిగిన సభలో ప్రధాని మోడీ అసలు చంద్రబాబు ప్రస్తావనే తీసుకురాలేదన్నారు. డ్వాక్రా సంఘాలను చంద్రబాబే ఉద్దరించినట్టు తన జేబు పత్రికల్లో అబద్ధాలు రాయించుకున్నాడని మండిపడ్డారు. నిజానికి డ్వాక్రా సంఘాల మహిళలను నమ్మించి మోసం చేసిన ఘనుడు చంద్రబాబేనని, రుణమాఫీ పేరుతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలను నట్టేట ముంచాడని మంత్రి ఉషాశ్రీ చరణ్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఉషాశ్రీ చరణ్ విలేకరుల సమావేశం నిర్వహించారు.