చంద్రబాబునాయుడు ఒక పథకం ప్రకారమే కర్నూలు వచ్చి దాడి అంటూ హంగామా చేశారని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. చంద్రబాబు తన కాన్వాయ్‌లో రాళ్లు, కర్రలు తీసుకొచ్చారని, టీడీపీ కార్యకర్తలు విద్యార్థులపై దాడి చేశారని చెప్పారు. నిజంగా విద్యార్థులు సంయమనం కోల్పోయి దాడి చేసి ఉంటే చంద్రబాబు కర్నూలు దాటి వెళ్లగలిగేవాడా అని హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు. చంద్రబాబు ముమ్మాటికీ రాయలసీమ ద్రోహేనని, అందుకే న్యాయ రాజధాని ఇస్తానంటే కుట్రలతో అడ్డుకుంటున్నాడని చెప్పారు. వందేళ్లుగా న్యాయ రాజధాని కోసం పోరాటం చేస్తుంటే చంద్రబాబు మాత్రం మరో వందేళ్లు రాయలసీమ వెనుకబడే ఉండాలని కోరుకుంటున్నాడని, చంద్రబాబుకి తాను పుట్టిన గడ్డ రాయలసీమపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా తన హయాంలో ఎందుకు కర్నూలుకు న్యాయ రాజధాని ఇవ్వలేదని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రశ్నించారు.