రైతుల భూములతో వ్యాపారాలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి టీడీపీ నేతలను హెచ్చరించారు. టీడీపీ హయాంలో చేసుకున్నవి ఎంవోయూలు కాదు.. చీకటి ఒప్పందాలన్నారు. రాని పరిశ్రమలు జిల్లాకు వచ్చాయని టీడీపీ నేతలు విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అభూత కల్పనలను నిజాలుగా చూపించే క్రెడిట్ టీడీపీకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. రాప్తాడుకు జాకీ పరిశ్రమ వచ్చింది భూముల కోసమేనని.. వారు ఇక్కడ భూములతో వ్యాపారాలు చేయాలని చూశారని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆరోపించారు. జాకీ పరిశ్రమ టీడీపీ హయాంలో వచ్చినట్లు.. వైయస్ఆర్సీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయినట్లు ప్రచారం చేస్తున్నారని.. లీజు ప్రాతిపదికన ఏ కంపెనీ వచ్చినా పరిశ్రమలు పెట్టేందుకు తాము సహకరిస్తామని స్పష్టం చేశారు.