చదువులు కొనలేని కుటుంబాలు తమ పిల్లలను హాస్టళ్లకు పంపిస్తారని, వారు బాగా చదువుకోవడానికి, వారు బాగా ఎదగడానికి హాస్టళ్లు వేదిక కావాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. హాస్టళ్లలో ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా మారాలి. పిల్లలకు మంచి వాతావరణం అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. హాస్టళ్లలో వెళ్లేసరికి జైల్లోకి వెళ్లిన భావం పిల్లలకు ఉండకూడదని సూచించారు. మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం శ్రీ వైయస్.జగన్ సమీక్ష నిర్వహించారు. గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని వివరించిన అధికారులు. అంగన్‌వాడీలలో సూపర్ వైజర్ల పోస్టులను భర్తీచేశామని తెలియజేసిన అధికారులు. అంగన్వాడీలలో పాల సరఫరాపై నిరంతర పర్యవేక్షణ, వాటి ఫలితాలను అధికారులు వివరించారు. అక్టోబరు నెలలో నూటికి నూటికి నూరుశాతం పంపిణీ జరిగిందన్నారు. డిసెంబర్1 నుంచి ఫ్లేవర్డ్ మిల్క్‌ను అంగన్వాడీల్లో అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని, పైలెట్ ప్రాజెక్టు కింద ముందుగా కొన్ని అంగన్‌వాడీల్లో అమలు చేస్తామని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. మూడు నెలల్లోగా రాష్ట్రంలోని అన్ని అంగన్‌వాడీలలో సరఫరా చేయడానికి చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.