గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైయస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు.