అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరిస్తున్నట్టు ఎలాన్ మస్క్ ప్రకటించారు. అయితే, తనను నిషేధించిన ట్విట్టర్లోకి తిరిగి రావడానికి ఆసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ట్విట్టర్ లోకి రావడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదన్నారు. తన సొంత సంస్థ అభివృద్ధి చేసిన ట్రూత్ సోషల్ ట్విట్టర్ కంటే మెరుగైన యూజర్ ఎంగేజ్మెంట్ను కలిగి ఉండి, అద్భుతంగా పనిచేస్తోందని పేర్కొన్నారు.