కర్ణాటకలో 5 దశాబ్దాల చరిత్ర సుదీర్ఘ చరిత్ర కలిగిన బసవనగుడి వేరుశనగ జాతర ఆదివారం ప్రారంభం కానుంది. ఈ సందర్బంగా సీఎం బసవరాజ్ బొమ్మైకు తులాభారంతో ప్రక్రియ మొదలవుతుంది. జాతరలో గ్రామీణ సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో వేరుశనగ రైతులు, ప్రజలు చేరుకుంటున్నారు. ఈసారి కెంపాబుది చెరువులో తెప్పోత్సవం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. థీమ్ పార్కులో వేరుశనగ విక్రయాలకు అవకాశం కల్పించినట్లు స్థానిక నేతలు తెలిపారు.