ఆగ్నేయ బంగాళఖాతంలో వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉందని వాతావారణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మంగళవారం వరకూ వేటకు వెళ్లొద్దంటూ మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేసింది.