వైసీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు శనివారం పాములు, సాలీళ్లు, పక్షులు, ఇతర జంతువులతో సరదాగా గడిపారు. ఆ ఫొటోలను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అవి శంషాబాద్ ఫామ్‌హౌ్‌సలోని దృశ్యాలని తెలిపారు. దీంతో... సాయిరెడ్డికి శంషాబాద్‌లో ఫామ్‌హౌస్ ఉందా...అనే చర్చ మొదలైంది. ఆ తర్వాత... ఆ పాములు, పక్షులను గతంలో ఎక్కడో చూశామే అనే సందేహమూ కలిగింది. చివరికి... కేసినో వివాదంలో విచారణ ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్ కూడా అదే ఫామ్ హౌస్‌లో అవే పాములు, పక్షులతో దిగిన ఫొటోలు ట్విటర్‌లోనే బయటపడ్డాయి. వెరసి... విజయసాయిరెడ్డి శనివారం చీకోటి ఫామ్‌హౌ్‌సకు వెళ్లారని నిర్ధారణ అయ్యింది. అయితే... ఆ ఫామ్‌హౌస్ ఎవరిదో సాయిరెడ్డి చెప్పలేదు. ‘శంషాబాద్ ఫామ్‌హౌస్’’ అని చెప్పి వదిలేశారు.