రాజ్యాంగ దినోత్స వాన్ని పురస్కరించుకుని ఈనెల26న అమలాపురం ఎర్ర వంతెన వద్ద మాలల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జిల్లా సాధన సమితి ప్రతి నిధులు తెలిపారు. అమలాపురం కాటన్ అతిథిగృహం లో నిర్వహించిన సమావేశంలో శనివారం సాధన సమితి చైర్మన్ డీబీ లోక్ మాట్లాడుతూ మాలలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడంతో పాటు ఎవరికైనా అన్యాయం జరిగితే వారికి అండగా నిలిచే లక్ష్యంతో ఈఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాజ్యాంగ దినోత్స వంతో పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరిట కోనసీమ జిల్లాను ఏర్పాటు చేసినందుకు విజయో త్సవాలు నిర్వహిస్తున్నట్లు సమితి కన్వీనర్ జంగా బాబూ రావు, ప్రధాన కార్యదర్శి ఇసుకపట్ల రఘుబాబు చెప్పారు. సమావేశంలో నాయకులు పెనుమాల చిట్టిబాబు, బత్తుల సాయి, ఉండ్రు బాబ్జి, అయితాబత్తుల సుభాషిణి, బొంతు బాల రాజు, నక్కా చంద్రశేఖర్, మోకా శ్రీను, ఊటాల వెంకటేష్, రేవు తిరుపతిరావు, నక్కా సంపత్‌కుమార్, పోతుల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.