సహజీవనం చేస్తున్న మహిళ మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఆమెను విచక్షణారహితంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ ఎం.వీరబాబు శనివారం తెలిపారు. నరసాపురం మండలం చిట్టవరానికి చెందిన నక్కా పోతురాజు మొగల్తూరుకు చెందిన నంగల లక్ష్మి (42) స్థానిక ఆదర్శనగర్ కాల నీలో ఎనిమిదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో పోతురాజు శుక్రవారం మధ్యాహ్నం మద్యం తాగేందుకు ఆమెను డబ్బులు అడగడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అసహనానికి గురైన అతను విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి క్షతగాత్రురాలిని నరసాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఏసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.