వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కొండచిలువతో ఫోటోకు పోజులిచ్చారు. శంషాబాద్ లో గల ఫామ్ హౌస్ లో ఓ తెల్ల కొండ చిలువను ఆయన మెడలో వేసుకుని ఫోటో దిగారు. అనంతరం ఓ చిన్న కొండ చిలువను పట్టుకుని.. ఓ సాలీడుని చేతిపైకి ఎక్కించుకున్నారు. జీవుల వైవిధ్య భరిత సౌందర్యం ఆసక్తిగా గమనించడం తనకు వినోదం కలిగిస్తుందని తెలిపారు. ఈ ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు