వేగంగా వెళ్తున్న మోటారుబైక్ అదుపు తప్పి ఓ వృద్ధుడు మృతి చెందాడు.ఈ సంఘటన శనివారం వరికుంటపాడు, జడదేవి గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే... , దుత్తలూరు మండలం కమ్మవారిపాళెంకి చెందిన బత్తుల వెంకటయ్య(80) మండలంలోని అలివేలుమంగాపురంలోని తన కుమార్తె వద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తన మనుమరాలు భర్త ప్రకాశం జిల్లా వలేటివారిపాళెంకి చెందిన చల్లా శ్రీను గ్రామానికి వచ్చి వృద్ధుడితో కలిసి మోటారుబైక్పై వలేటివారిపాళెం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.