హైదరాబాద్‌లోని వైఎన్ఎం కళాశాల పూర్వ విద్యార్థుల కాన్వకేషన్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఇప్పటి వరకు అనుకున్నదంతా చేశానని అన్నారు. కష్టనష్టాలను ఎదుర్కొనే గుణాన్ని, కష్టాన్ని ఎన్సీసీ తనకు నేర్పిందని చెప్పారు. కాలేజీలో ఆడిన నాటకంతో సినిమాల్లోకి వచ్చానని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ కూడా తాను అనుకున్నది చేసే రకం అని చిరంజీవి వెల్లడించారు. పవన్ రాజకీయాలకు సరిపోతారని అంటున్నారు. ఏదో ఒక రోజు పవన్ కళ్యాణ్‌ని ఉన్నత స్థాయిలో చూస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.రాజకీయాల్లో మాటలు మాట్లాడాలని, కొన్నిసార్లు మనం కూడా మాటలు మాట్లాడాల్సి వస్తుందని చిరంజీవి వెల్లడించారు.