స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రజావేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఈరోజు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాజరయ్యారు.ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం రాష్ట్ర ప్రజలకు నష్టమని ఉండవల్లి అన్నారు.ఉక్కు కర్మాగారం పరిరక్షణకు భారీ సభ నిర్వహించి డిక్లరేషన్ ఇవ్వాలని ఉండవల్లి పిలుపునిచ్చారు.ప్రజల ఆకాంక్షలను కేంద్రం గుర్తించాలని ఆర్.నారాయణమూర్తి అన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని, దస్తూరి కమిటీ నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేశారు.