భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) కంటిశుక్లం శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో ద్రౌపది ముర్ము కంటికి ఈరోజు శస్త్రచికిత్స జరిగింది. గత కొంత కాలంగా ముర్ము కుడి కన్ను శుక్లాలతో బాధపడుతున్నారు. వైద్యుల సూచన మేరకు ఈరోజు శస్త్ర చికిత్స చేయించుకున్నారు.శస్త్రచికిత్స విజయవంతమైందని, ద్రౌపది ముర్ము డిశ్చార్జ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో ప్రకటించింది.