ఉన్నత విద్యాశాఖలో హాజరు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురానుంది. విద్యార్థులకు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ వంటి అన్ని కోర్సుల్లో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. కేవలం 2 నిమిషాల్లోనే విద్యార్థుల హాజరు నమోదు చేసేలా యాప్ రూపొందించనున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోగా విద్యార్థుల నమోదు పూర్తి చేసేందుకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జియో ట్యాగింగ్ ద్వారా ఆయా కాలేజీల్లో మాత్రమే యాప్ పనిచేసే విధంగా యాప్ ను రూపొందించనున్నారు.