అదుపుతప్పి ద్విచక్ర వాహనం కింద పడటంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఒంగోలులోని భాగ్యనగర్ లో చోటు చేసుకున్నది. సైకిల్ పై వస్తున్న యువకుడిని తప్పించబోయి ద్విచక్ర వాహనదారుడు అదుపుతప్పి ప్రమాదానికి గురైన సంఘటన సోమవారం చోటు చేసుకున్నది. రహదారి గుండా వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడికి, సైకిల్ పై వెళ్తున్న యువకుడు అడ్డుగా రావటంతో తప్పించబోయి ద్విచక్ర వాహన దారుడు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో ద్విచక్ర ఆవాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో వైద్యశాలకు తరలించారు.