ఫిఫా వరల్డ్ కప్-2022ను మరో వివాదం చుట్టుముట్టింది. వివాదాస్పద మతగురువు జకీర్ నాయక్‌కు ఖతార్ పాలకులు ఆహ్వానం పలికినట్లు తెలుస్తోంది. మనీలాండరింగ్, విద్వేషపూరిత ప్రసంగాల నేపథ్యంలో ఆయనపై భారత్‌లో కేసులు నమోదు అయ్యాయి. ఆయనకు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్‌పై భారత్ నిషేధం విధించింది. 2017లో భారత్ నుంచి పరారైన ఆయన ప్రస్తుతం మలేషియాలో ఉన్నారు. ఆయనను ఫిఫా వరల్డ్ కప్‌కు పిలవడంపై వివాదం నెలకొంది.