పంజాబ్ లోని భారత్-పాక్ సరిహద్దు వద్ద రెండు డ్రోన్లు కలకలం రేపాయి. జవాన్లు కాల్పులు జరపడంతో పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాయి. తొలి డ్రోన్ గురుదాస్‌పూర్ జిల్లా కాసోవాల్ ప్రాంతంలో కనిపించింది. బీఎస్ఎఫ్ దళాలు ఆ డ్రోన్‌పై దాదాపు 96 రౌండ్ల కాల్పులు, 5 ఇల్యుమినేషన్ బాంబులను ప్రయోగించింది. అమృత్సర్ జిల్లాలోని చన్నా పఠాన్ లో మరో డ్రోన్ కనిపించగా, బీఎస్ఎఫ్ 10 రౌండ్ల కాల్పులు జరపడంతో వెనక్కి వెళ్లిపోయింది.