క్రికెట్ బెట్టింగ్లో సర్వం కోల్పోయిన ఓ యువకుడు (25) ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని నాగ్పూర్ పరిధి కోరడిలో ఆదివారం జరిగింది. తన కొడుకు బెట్టింగ్ కారణంగా లక్షల మేర అప్పులు పాలయ్యాడని మృతుడి తండ్రి తెలిపాడు. అప్పుల్లో కొన్నింటిని తాము తీర్చామని చెప్పాడు. ఇంతలోనే తీవ్రమైన డిప్రెషన్ కారణంగా తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.