ఉద్యోగుల, అధికారుల మనోభావాలు దెబ్బ తినేలా విమర్శించడం చాలా బాధ కలిగించిందని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి అన్నారు. ఆయన ఆదివారం రాజంపేటలో మాట్లాడుతూ ఎవరైనా సరేపోలీసులను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్నారు. పార్టీ అధినేత ఎదుట మొప్పు పొందాలని పోలీసు వ్యవస్దను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తారా? అన్నారు. రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న రాజంపేట టిడిపి ఇన్చార్జి బత్యాల చెంగల్ రాయులు పోలీసులను కించపరిచేలా మాట్లాడటం శోచనీయం అన్నారు. పోలీసు వ్యవస్థ మనో స్థైర్యం దెబ్బతినేలా మాట్లాడారన్నారు. పోలీసులపై బత్యాల వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గం, హేయం అన్నారు. చట్టం ఎవరి చుట్టం కాదన్నారు.