రాష్ట్రంలో RBKల ద్వారా ధాన్యం సేకరించి 21 రోజుల్లోనే నగదు చెల్లిస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ధాన్యం డబ్బులతో పాటు, గోనెసంచుల డబ్బులు, హమాలీ ఛార్జీలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ధాన్యం సేకరణలో మిల్లర్లు జోక్యం చేసుకోవద్దని, అతిక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.