మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్‌పై అత్యాచారం, గృహ హింస కింద కేసు నమోదైంది. భార్యపై అసహజ శృంగారానికి, బెదిరింపులకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి. ఉమంగ్ సింగార్‌పై ధార్ జిల్లాలో భార్య ఫిర్యాదు చేసింది. సహజీవనం చేస్తున్న సోనియా భరద్వాజ్ ఆత్మహత్య పాల్పడటానికి ఎమ్మెల్యేనే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ కేసులపై ఎమ్మెల్యే ఉమంగ్ సింగార్ స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఓ కేసులో తనను ఇరికించి, తన భార్యే రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తోందని ఆరోపించారు.