మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీపై ఎన్సీపీ నాయకులు అజిత్ పవార్ సోమవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ను, మహారాష్ట్ర ప్రజల భావోద్వేగాలను కోష్యారీ అర్ధం చేసుకోవాలన్నారు. లేని పక్షంలో గవర్నర్ పదవికి రాజీనామా చేయాలన్నారు. ఛత్రపతి శివాజీ పాతరోజులకు ఐకాన్ అని ఔరంగాబాద్‌లో శనివారం ఓ కార్యక్రమంలో గవర్నర్ కోష్యారీ అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం ఏర్పడింది.