వస్తు సేవల పన్ను చట్టంలో కొన్నిసవరణలు చేయాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ఐపీసీ పరిధిలోని శిక్షలను జీఎస్టీ చట్టం నుంచి తొలగించాలని భావిస్తోంది. జీఎస్టీ చట్టాన్ని నేరరహితంగా మార్చే దానిపై వచ్చే జీఎస్టీ మండలి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. సవరణలను పార్లమెంటు ఆమోదించిన తర్వాత రాష్ట్రాలు కూడా ఆ మేరకు జీఎస్టీ చట్టాల్లో మార్పులు చేసుకోవాలి.