నేడు మత్స్యకార సహకార దినోత్సవం సందర్భంగా మత్స్యకారులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర మత్స్యకారులకు నేటికీ సరైన సౌకర్యాలు లేవన్నారు. వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్య్యకారులకు రూ.10 లక్షలు ఇస్తామనే హామీ ఇప్పటికీ అమలు కావడం లేదన్నారు. మత్స్యకారులకు విద్య వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, వారికి జనసేన ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పవన్ తెలిపారు.