ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2021-22 కింద ఎంపికైన లబ్ధిదారులు గృహనిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆత్మకూరు ఎంపీడీవో సీ శ్రీనివాసరావు, తహసీల్దారు పీఎల్. లక్ష్మీనరసింహం పేర్కొన్నారు. మండలంలోని చెర్లోయడవల్లిలో ఆదివారం పీఎంజీవై-వైఎస్ఆర్ గ్రామీణ లబ్ధిదారుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో 148 గృహాలు ఈ పథకం కింద మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కొక్క గృహానికి రూ.1.80 లక్షలు మంజూరవుతాయన్నారు. లబ్ధిదారులు గృహ నిర్మాణ పనులను చేపడితే దశలవారీగా బిల్లులు అందుతాయన్నారు. కార్యక్రమంలో హౌసింగ్ ఏఈ ఎం.వివేక్, వర్క్ ఇన్స్పెక్టర్ శరత్, పంచాయతీ కార్యదర్శి శాంతి తదితరులు పాల్గొన్నారు.