టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు లేదని, నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలు చెప్పులతో కొట్టే కొట్టేరోజులు దగ్గరపడ్డాయని ఆ పార్టీ నాయకులు హెచ్చరించారు. పార్టీ కార్యాలయంలో తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి రెయ్యి ప్రీతీష్, మండల తెలుగు యువత అధ్యక్షుడు కోళ్ల కామేష్, పార్టీ మండల కార్యదర్శి మామిడి రాము విలేఖరులతో మాట్లాడారు. చంద్రబాబును పరుషపదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. టీడీపీ నాయకులు దమయంతి, కాళీ, దల్లి ప్రసాదరెడ్డి, ముడిదాన ఆనంద్‌కుమార్, కిరణ్, ప్రపుల్లా, రాజశేఖర్ పాల్గొన్నారు.