తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డిసెంబరు ఒకటి నుంచి చేపట్టనున్న ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, నరసన్నపేట నియోజక వర్గం టీడీపీ ఇన్చార్జి బగ్గు రమణమూర్తి పిలుపునిచ్చారు. సవరడ్డపనస గ్రామంలో గల పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యా లు ప్రజల్లోకి తీసుకువెళ్లనున్నట్టు తెలిపారు. ఇందుకోసం గ్రామ, మండల, జిల్లా కమిటీలు సమన్వయంతో పనిచేసి ప్రజలను చైతన్యం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు తనస్థాయి మరచి మాట్లాడుతున్నారని, ఇది మంచి సంస్కృతి కాదని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హితవు పలికారు.