బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం స్థిరంగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఇది నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని, రానున్న 24 గంటల్లో తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా దిశగా పయనించే అవకాశం ఉందని పేర్కొంది. రానున్న 24 గంటల్లో మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించారు.దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో ఉత్తర ఆంధ్రలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 23న రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది.