టీ20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ ఘోర వైఫల్యం చెందడంతో ఆ దేశ బోర్డు ప్రక్షాళణకు శ్రీకారం చుట్టింది. దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారాతో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ముందుగా వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ నికోలస్ పూరన్‌పై ఆ కమిటీ వేటు వేసింది. కెప్టెన్సీ బాధ్యతల నుంచి అతనిని తప్పించింది. రోవ్‌మన్ పొవెల్‌కు జట్టు పగ్గాలందిచాలని భావిస్తోంది. ఈ విషయంపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన ఒకటిరెండు రోజుల్లో వెలువడనుంది.