విశాఖ నగరానికి చెందిన ఓ వివాహిత ఇన్ స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి కష్టాలు కొని తెచ్చుకుంది. గూడూరుకు చెందిన చెన్నూరు శేఖర్(24) నగరానికి చెందిన ఓ వివాహితకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. దీన్ని ఆమె యాక్సెప్ట్ చేయగా స్నేహం పేరిట ఆమెతో పరిచయం పెంచుకుని వీడియో కాల్స్, రికార్డింగ్స్ తో బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె అనేకసార్లు డబ్బులు చెల్లించినా వేధింపులు ఆగకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితుణ్ని అరెస్ట్ చేశారు.