సోలోమాన్ ఐలాండ్స్ లో భారీ భూకంపం సంభవించిన నేపథ్యంలో యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే సునామీ హెచ్చరికలు జారీ చేసింది. మలోగా ప్రాంతంలో వచ్చిన ఈ భూకంప కేంద్రం నుంచి 300 కి.మీల లోపు సోలమన్ తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఈ హెచ్చరికలతో అక్కడ నివసించే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూకంపం వల్ల జరిగిన నష్టంపై ఇంకా స్పష్టత రాలేదు.