ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాన్ పిహెచ్ వర్కర్లకు దిశ నిర్దేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 11:59 AM

గుంతకల్లు మున్సిపాలిటీలో పని చేస్తున్న నాన్ పిహెచ్ వర్కర్ల హాజరు పట్టికను మంగళవారం కమిషనర్ బండి శేషన్న పరిశీలించి పనుల నిర్వ హణపై దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులలో కుళాయిలకు తాగునీరు వదలినపుడు తప్పనిసరిగా ఆ వార్డు లో పర్యటించి ప్రజలు నీరు వృధా చేయకుండా చూడాలన్నారు. అదే విధంగా నీటి పన్నులు చెల్లింపు చేసేలా చూడాలన్నారు. డివైడర్ల మధ్యలో వేసిన పూల మొక్కల మధ్య ఉన్న పిచ్చిమొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలని ఆదేశించారు. ఆయనతో పాటు చైర్ పర్సన్ భర్త మున్సిపల్ మాజీ చైర్మన్ రామలింగప్ప, డిఇ శ్రీధర్ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com