ప్రముఖ పత్రికకు ఒకప్పుడు కాస్త క్రెడిబులిటీ ఉండేది. కానీ ఇప్పుడు, నిత్యం తప్పుడు వార్తలు, చంద్రబాబు అనుకూల భజనతో అదొక పచ్చ పత్రికగా, కేవలం జగన్ మోహన్ రెడ్డిగారి మీద విషం చిమ్మటానికే పుట్టినట్టు దుష్ప్రచారం చేస్తుంది. చంద్రబాబు అవినీతి సామ్రాజ్యాన్ని రామోజీరావు జాకీలు పెట్టి లేపాలనుకుంటూ, నిత్యం తప్పుడు వార్తలు వండివారుసున్నాడు. రామోజీ రావుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే... టీడీపీ హయాంలో తెస్తామన్న రూ. 20లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు ఎక్కడకు వెళ్లాయని, ఎవరు ఎత్తుకు వెళ్ళారని చంద్రబాబును ప్రశ్నించాలి. వాస్తవాలు బయటకు తీసుకురావాలి గానీ, ఎంతసేపటికీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారి ప్రభుత్వంపై బురదచల్లితే ప్రజలు నమ్మరు అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు.