స్పేస్ రాకెట్ నుంచి హోమ్ డెలివరీ సేవల వరకూ స్టార్టప్ లదే హవా. అయితే తాజాగా అంత్యక్రియలకూ ఓ స్టార్టప్ ఐడియాతో ముందుకు వచ్చింది ముంబయికి చెందిన ‘సుఖాంత్ ఫ్యునరల్ మేనేజ్ మెంట్ లిమిటెడ్.’ కర్మకాండలతో పాటు అంబులెన్స్ సర్వీస్, మరణ ధ్రువీకరణ పత్రం పొందేందుకు సాయం చేస్తామని చెబుతోంది. దీనికి సంబంధించిన ఫోటోను ఐఏఎస్ అధికారి అవనీష్ వైష్ణవ్ పోస్ట్ చేస్తూ ‘ఇలాంటి స్టార్టప్ అవసరం ఉందా?’ అని ట్వీట్ చేశారు.