అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన పర్చూరులోని ఎస్టీ బాలుర వసతిగృహం విద్యార్థుల పరిస్థితి దయనీయంగా తయారయింది. ఇరుకు గదుల్లో, సౌకర్యాల లేమితో వారు సతమతమవుతున్నారు. ఇక పారిశుధ్యం పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. దోమలన్నిటికీ ఈ హాస్టల్ ఆవాసంగా తయారయింది. దీంతో రోగాలు వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది.
ఇక హాస్టల్ విద్యార్థులకు పెట్టే ఆహారం కూడా నాసిరకంగా ఉంటుందని విమర్శలు లేకపోలేదు. అధికారులే కాకుండా ప్రజా ప్రతినిధులు కూడా ఎప్పుడూ ఈ హాస్టల్ ను సందర్శించిన దాఖలాలు లేవు. జిల్లా కలెక్టర్ అయినా తమను కరుణించాలని ఆ హాస్టల్ విద్యార్థులు కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa