ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏఎంసీ చైర్మన్ లకు ఎక్స్అఫిసియో హోదా ఇవ్వాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Nov 22, 2022, 12:09 PM

ఏఎంసీ చైర్మన్లు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరయ్యే అవకాశం కల్పిస్తూ వారిని ఎక్స్ అఫిసియో సభ్యులుగా ఆహ్వానితుల జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ మార్కెటింగ్ సలహాదారుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. సోమవారం సాయంత్రం ఆయన మంత్రితో సమావేశమై వ్యవసాయ మార్కెట్ కమిటీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం నిర్దిష్టమైన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు.


అలాగే సహకార బ్యాంకులకు సొంత భవనాలు ఏర్పాటు చేయడానికి స్థల కేటాయింపులు చేయాలన్నారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ చిరంజీవిచౌదరి ని ఆయన కలుసుకొని పలు విజ్ఞప్తులు చేశారు. రాష్ట్ర సహకార బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, హార్టికల్చర్ డైరెక్టర్ రామారావులు కూడా ఆయన వెంట ఉన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com