ప్రజలకు 16 ఏళ్లకే ఓటు హక్కు కల్పించాలని న్యూజిలాండ్ భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనను పార్లమెంట్ లో ప్రవేశపెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ చెప్పారు. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే 75 శాతం మంది సభ్యుల మద్దతు కావాల్సి ఉండగా.. ప్రతిపక్షాలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ ఆస్ట్రియా, మాల్టా, బ్రెజిల్, క్యూబా, ఈక్వెడార్ దేశాల్లో 16 ఏళ్ల వారికి ఓటు హక్కు ఉంది.