వారణాసిలోని జ్ఞాన్ వాపీ మసీదులో బయటపడిందంటున్న శివలింగం వయసు నిర్ధారణకు సంబంధించిన పిటిషన్ ను ఈ నెల 30న విచారిస్తామని అలహాబాద్ హైకోర్టు తెలిపింది. ఈ లింగం ఎప్పటిదో తెలుసుకోవడానికి కార్బన్ డేటింగ్ పద్ధతిలో పరీక్షించాలనే పిటిషన్ ను వారణాసి జిల్లా కోర్టు తోసిపుచ్చింది. దీనిపై సవరణ పిటిషన్ ను వేయగా అలహాబాద్ కోర్టు 30న విచారిస్తామని ప్రకటించింది.